జులై రెండో వారం నుంచి..
close
Updated : 25/06/2021 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జులై రెండో వారం నుంచి..

వన్‌ కల్యాణ్‌, రానా కథా నాయకులుగా సాగర్‌.కె.చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ మేజర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కరోనా పరిస్థితుల వల్ల తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులన్నీ కుదుట పడటంతో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. జులై రెండో వారం నుంచి హైదరాబాద్‌లో ఈ కొత్త షెడ్యూల్‌ మొదలు కానుందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికేసన్నాహాలు ప్రారంభించారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. పవన్‌ శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా కనిపిస్తారు. ఇందులో రానా సరసన ఐశ్వర్య రాజేశ్‌ నటించనున్నట్లు తెలిసింది. పవన్‌కు జోడీ ఎవరన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని