చిరంజీవి... ప్రభాస్‌లతో సినిమాలు నిర్మిస్తాం
close
Updated : 25/06/2021 04:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరంజీవి... ప్రభాస్‌లతో సినిమాలు నిర్మిస్తాం

‘‘నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టాక కథా నాయకుడిగా నేనెలాంటి ప్రణాళికలతో సినిమాలు చేయాలో మరింత బాగా  అర్థమైంది. అనుకోకుండానే నిర్మాణంలోకి అడుగుపెట్టా. ఈ ప్రయాణం నాకు చాలా విషయాల్నే నేర్పుతోంది’’ అన్నారు యువ కథానాయకుడు హవీష్‌. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన  ‘నువ్విలా’ చిత్రంతో కథానాయకుడిగా మారిన ఈయన, ‘రాక్షసుడు’ చిత్రంతో నిర్మాతగానూ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రవితేజతో ‘ఖిలాడి’ నిర్మిస్తున్నారు. మరోపక్క  కథానాయకుడిగానూ సినిమాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం హవీష్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురువారం ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘లాక్‌డౌన్‌ సినిమాలన్నిటికీ బ్రేక్‌ వేసింది. ఈ విరామంలో నేను నటించనున్న కొత్త సినిమాల కోసం రెండు కథలు విని పక్కా చేసుకున్నా. ఆ వివరాలు త్వరలోనే నిర్మాతలు ప్రకటిస్తారు. వాటితోపాటు ‘వారియర్‌’ అనే మరో సినిమానీ చేస్తా. స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే ఆ కథ అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతుంది’’.
‘‘మొదట్నుంచి నేను భిన్నమైన కథలతోనే సినిమాలు చేశా. ‘సెవెన్‌’కి ముందు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నా. లింగుసామి దర్శకత్వంలో సినిమా కోసం చర్చలు జరిగాయి. కథ కుదరలేదు. మంచి కథలు కుదిరినప్పుడు కచ్చితంగా ఆ ఇద్దరితోనూ సినిమాలు చేస్తా. చిన్నప్పట్నుంచి మేం వ్యాపార రంగంలో ఉన్నాం. నిర్వహణ ఎలా చేయాలో నాకు అవగాహన ఉంది. అందుకే నటన, నిర్మాణం, విద్యాసంస్థలు ఇలా  ఎన్ని పనులు చూసుకుంటున్నా... ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. కూకట్‌పల్లిలో ఓ గ్రీన్‌ స్టూడియోని నిర్మిస్తున్నాం. అక్కడే రవితేజ, పవన్‌కల్యాణ్‌ సినిమాలకి సెట్స్‌ వేశాం’’.
‘‘రవితేజతో ప్రస్తుతం నిర్మిస్తున్న ‘ఖిలాడి’ 20 రోజులు చిత్రీకరణ చేస్తే పూర్తవుతుంది. మరో వారం రోజుల్లో చిత్రీకరణ మొదలు పెడతాం. దుబాయ్‌లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉంది. రవితేజ కెరీర్‌లో ఇప్పటివరకు చూడని ఓ స్టైలిష్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. అక్షయ్‌కుమార్‌తో ‘రాక్షసుడు’ సినిమాని రీమేక్‌ చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయడం కుదరక ఆయనకి హక్కులు ఇచ్చేశాం. తదుపరి మా సంస్థలో రవితేజతోపాటు ప్రభాస్‌, చిరంజీవి తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నాం’’.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని