Chiranjeevi: ‘ఆచార్య’ సన్నాహాలు
close
Updated : 27/06/2021 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: ‘ఆచార్య’ సన్నాహాలు

కథానాయకుడు చిరంజీవి ‘ఆచార్య’కు గుమ్మడికాయ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. చివరి షెడ్యూల్‌ కోసం వచ్చే నెల నుంచి రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం చిత్ర బృందం ఇప్పటికే సన్నాహాలు  ప్రారంభించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ నాయిక. రామ్‌చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తుది దశ చిత్రీకరణలో నిలిచిన ఈ సినిమా, జులై రెండో వారం నుంచి తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. దాదాపు 15రోజుల పాటు సాగే ఈ ఆఖరి షెడ్యూల్‌లో.. చిరుతో పాటు  మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు సమాచారం. చరణ్‌ రెండు రోజుల ప్యాచ్‌ వర్క్‌ కోసం తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాలోని రెండో లిరికల్‌ గీతానికి సంబంధించి ఓ ప్రకటన  వెలువడనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. చరణ్‌, పూజాలపై   చిత్రీకరించిన పాట విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ  చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: తిరు.

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని