Lucifer remake: పనులు మొదలు
close
Updated : 29/06/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lucifer remake: పనులు మొదలు

చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కి రీమేక్‌గా... సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంస్థలు కలిసినిర్మిస్తున్నాయి. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమా పనులు మొదలయ్యాయి. సోమవారం నుంచి సంగీత చర్చల్ని షురూ చేశారు. ఈ సందర్భంగాదర్శకుడు మోహన్‌రాజాతోకలిసున్న ఫొటోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు తమన్‌. ఈ చిత్రానికి స్వరకర్త తమనే. ‘‘ప్రియమైన మెగాస్టార్‌పైన ప్రేమ చూపించే సమయం వచ్చింది’’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు తమన్‌. రాజకీయ నేపథ్యంతోకూడుకున్న కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు. ఆ తర్వాత ‘లూసిఫర్‌’ రీమేక్‌ కోసం రంగంలోకి దిగనున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని