పవన్‌ కొత్త సినిమాపై స్పందించిన హరీశ్‌ శంకర్‌
close
Published : 04/02/2020 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ కొత్త సినిమాపై స్పందించిన హరీశ్‌ శంకర్‌

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ అభిమానులను ‘గబ్బర్‌ సింగ్‌’తో కాలరెగరేసుకునేలా చేసిన దర్శకుడు హరీశ్‌ శంకర్‌. పవన్‌ స్టామినా ఎంటో చిత్ర పరిశ్రమకు రుచి చూపించారు. 2012లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ హిట్‌ కాంబినేషన్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఇటీవల ప్రకటించింది.

అయితే, తమిళంలో ఘన విజయం సాధించిన విజయ్‌ ‘తేరీ’, అజిత్‌ ‘వేదాళం’ చిత్రాలలో ఏదో ఒకదానికి రీమేక్‌ చేయాల్సిందిగా నిర్మాణ సంస్థ హరీశ్‌ శంకర్‌ను కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. గతంలో పవన్‌తో ‘తేరీ’ని తీయాలని మైత్రీ మూవీ మేకర్‌ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు హరీశ్‌ శంకర్‌కు ఆ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి రీమేక్‌ చేయమని కోరినట్లు వార్తలు రావడంతో హరీశ్‌ శంకర్‌ వాటిపై స్పందించారు. విలేకరులకు తాను ఫోన్‌ కాల్‌ దూరంలో అందుబాటులో ఉంటానని ఏ విషయానైనా అడిగి తెలుసుకోవచ్చని కోరారు. పాఠకులను తప్పుదోవ పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు.

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ తన 28వ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ‘పింక్‌’ రీమేక్‌తో పాటు, క్రిష్‌ దర్శకత్వంలోనూ పవన్‌ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే హరీశ్‌ శంకర్‌ సినిమా మొదలు కానుంది. ప్రస్తుతం కథ, నటీనటులు, సాంకేతిక బృందంపై కసరత్తులు చేస్తున్నారు. త్వరలోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని