‘క్రిష్‌ 4’ కథ ఇదేనా? - gossips on krish 4 story
close
Published : 25/06/2021 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్రిష్‌ 4’ కథ ఇదేనా?

ముంబయి: హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘క్రిష్‌’ సిరీస్‌ చిత్రాలకు ఎంతోమంది అభిమానులున్నారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో ‘క్రిష్‌ 4’ రానున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘కోయీ మిల్‌ గయా’తో అందరికి పరిచయమైన గ్రహాంతరవాసి పాత్ర జాదు ‘క్రిష్‌ 4’లో కనిపించనున్నాడని వార్తలొచ్చాయి. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన వార్త ఒకటి బాలీవుడ్‌లో సందడి చేస్తోంది. ‘టైమ్‌ ట్రావెల్‌’ కథాంశంతో ఈ చిత్రం సాగనుందని సమాచారం. ఇటీవలే ‘క్రిష్‌’ విడుదలై 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘గతం అయిపోయింది. భవిష్యత్తు ఏం తీసుకొస్తుందో చూద్దాం’అని సోషల్‌ మీడియాలో స్పందించారు హృతిక్‌. ‘‘కోయీ మిల్‌ గయా’..క్రిష్‌ ఈ రెండింటిని ఒక్క చోట చేర్చే కథ ఇది. అందుకే ఈ చిత్రంలో టైమ్‌ ట్రావెల్‌ అనేది కీలకంగా కానుంది. ఆ దిశగానే కథ సిద్ధమవుతోంది’’అని చిత్ర దర్శకుడు, హృతిక్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌  సన్నిహిత వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని