మరోసారి జోడీగా.. - is this ramcharan and kiara pair up again
close
Updated : 24/03/2021 11:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి జోడీగా..

రామ్‌చరణ్‌ - కియారా అడ్వాణీ జోడీ మరోసారి తెరపై సందడి  చేయనుందా? అవుననే అంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా అగ్ర దర్శకుడు శంకర్‌ ఓ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 50వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. రామ్‌చరణ్‌కి 15వ చిత్రం. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా, శంకర్‌ మార్క్‌ హంగులతో  రూపొందనుంది. జూన్‌లో పట్టాలెక్కనున్న ఈ చిత్రం కోసం  కథానాయికగా కియారాని ఎంపిక చేశారని తెలిసింది. ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన కియారా, ఆ తర్వాత రామ్‌చరణ్‌తో కలిసి ‘వినయ విధేయ రామ’తో సందడి చేసింది. రెండోసారి ఈ జోడీ మురిపించేందుకు సిద్ధమవుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని