జపనీస్‌ జిగేల్‌ రాణిని చూశారా! - jigelu rani cover by japanese couple
close
Published : 02/07/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జపనీస్‌ జిగేల్‌ రాణిని చూశారా!

చెర్రీ పాటకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ డ్యాన్స్‌

వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: ‘జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌ జిగేలు రాణి’ అంటూ ఊరమాస్‌ స్టెప్పులు వేసి ప్రేక్షకులతో ఈలలు వేయించుకున్నారు నటుడు రామ్‌ చరణ్‌, నటి పూజా హెగ్డే. ‘రంగస్థలం’ చిత్రంలోని ఈ పాటకు ఫ్యాన్స్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. దీంతో ఇప్పటికీ పలువురు నెటిజన్లు ఈ పాటకు కవర్‌సాంగ్స్‌ చేస్తున్నారు. తాజాగా జపాన్‌కు చెందిన ఓ జంట ‘జిగేలు రాణి’ పాటకు డ్యాన్స్ చేసి అందర్నీ ఆకర్షించింది. ఇంతకీ ఆ జంట మరెవరో కాదు.. హీరోమునిరు, అతని సోదరి అశాహి ససాకీ.

ఎన్టీఆర్‌కు వీరాభిమానులైన ఈ అన్నాచెల్లిళ్లు.. తారక్‌ పాటలతో కవర్‌సాంగ్స్‌ క్రియేట్‌ చేసి ఇప్పటికే పలుమార్లు ఇంటర్నెట్‌ని షేక్‌ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ రామ్‌చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సినిమాలోని పాటకు కవర్‌సాంగ్‌ చేశారు. సినిమాలో రామ్‌చరణ్‌, పూజాహెగ్డే ఎలాంటి స్టెప్పులైతే వేశారో వాటినే అనుకరించింది ఈ జోడీ. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. వీళ్ల ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. తారక్‌ అంటే తమకెంతో ఇష్టమని.. ఆయన నటించిన ప్రతి చిత్రాన్ని చూస్తుంటామని.. సోషల్‌మీడియాలో ఫేమ్‌ పొందేందుకే ఎన్టీఆర్‌ పాటలకు కవర్‌సాంగ్స్‌ క్రియేట్‌ చేస్తున్నామని ఓ సందర్భంలో ఈ జోడీ తెలిపింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని