RRR ఆడియో హక్కులకు రికార్డు ధర.. దేశంలోనే అత్యధికం..! - lahari acquires rrr audio rights
close
Published : 27/07/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR ఆడియో హక్కులకు రికార్డు ధర.. దేశంలోనే అత్యధికం..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: విడుదలకు ముందే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ చిత్రం ఆడియో హక్కులను తాజాగా లహరి మ్యూజిక్‌, టీ సిరీస్‌ సంయుక్తంగా సొంతం చేసుకున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషల ఆడియో హక్కులను దక్కించుకున్నాయి. ఇందుకోసం ఏకంగా రూ.25కోట్లు వెచ్చించినట్లు సమాచారం. దీంతో దేశంలోనే ఆడియో హక్కులకు అత్యధిక ధర పలికిన సినిమాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు నెలకొల్పినట్లయింది. గతంలో ‘కేజీయఫ్‌2’ ఆడియో హక్కులను లహరి మ్యూజిక్‌ సంస్థ సుమారు రూ.7.2కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపించాయి. కాగా.. ఆడియో హక్కులను దక్కించుకున్న సందర్భంగా లహరి మ్యూజిక్‌ ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ఓ చిన్న వీడియోను పంచుకుంది.

రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. చరణ్‌కు జోడీగా అలియా భట్‌, తారక్‌ సరసన ఒలీవియా మోరీస్‌, కీలక పాత్రల్లో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్‌ పనుల్లో జక్కన్న టీమ్‌ నిమగ్నమై ఉంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని