close
Published : 22/01/2021 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాగశౌర్య ‘లక్ష్య’ టీజర్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: ‘పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం’ అంటున్నారు జగపతిబాబు. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘లక్ష్య’. నాగశౌర్య కథానాయకుడు. ఆర్చరీ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో శౌర్య సాఫ్ట్‌, రఫ్‌ లుక్స్‌లో విభిన్నంగా కనిపించనున్నారు. శుక్రవారం నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ‘లక్ష్య’ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

‘‘చాలా మందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ ఎవడో ఒక్కడు పుడతాడు. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు’ అంటూ టీజర్‌ ఆరంభంలో నాగశౌర్య పాత్రను ఉద్దేశిస్తూ జగపతిబాబు చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ టీజర్‌ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సారి శౌర్యకు హిట్‌ పక్కా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా సందడి చేయనున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ ప్రెజెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదీ చదవండి

మహేశ్‌కు ఈరోజు చాలా స్పెషల్‌



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని