Chiranjeevi: లూసిఫర్‌ రీమేక్‌ టైటిల్‌ అదేనా? - lucifer becomes veerayya in telugu
close
Published : 28/06/2021 21:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: లూసిఫర్‌ రీమేక్‌ టైటిల్‌ అదేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌ చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం కాగా, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా తమన్‌ను చిత్ర బృందం ఎంపిక చేసింది. కాగా, ఇప్పుడు టైటిల్‌ను కూడా ఖరారు చేసే పనిలో ఉన్నారు దర్శకుడు మోహన్‌రాజా.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా ‘వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. చిరు ఇందులో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. సత్యదేవ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా ఓకే చెప్పినట్లు సమాచారం. ‘ఆచార్య’ షూట్‌ పూర్తయిన వెంటనే చిరు ఈ సినిమా చిత్రీకరణ పాల్గొంటారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని