ఎందుకో తెలుసా..?
హైదరాబాద్: ఈరోజు తనకెంతో ప్రత్యేకమని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ టూర్లో ఉన్న ఆయన తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ఓ చక్కటి సందేశాన్ని పంచుకున్నారు. తన సతీమణి నమ్రత శిరోద్కర్‌తో కలిసి దిగిన ఓ అపురూప చిత్రాన్ని షేర్ చేశారు.
‘నేనెంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు నేడు. నమ్రత.. నీతో ప్రతిరోజూ ప్రత్యేకంగా ఉంటుంది కానీ ఈరోజు మాత్రం మరెంతో ప్రత్యేకం. నా అద్భుతమైన మహిళకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే బాస్ లేడీ’ అని మహేశ్ పేర్కొన్నారు. ఆయన పెట్టిన పోస్ట్‌పై నమ్రత సంతోషం వ్యక్తం చేశారు. ‘నా ప్రతి ఏడాదినీ ఎంతో స్పెషల్‌గా చేస్తున్నందుకు థ్యాంక్యూ. లవ్ యూ’ అని రిప్లై ఇచ్చారు. నమ్రత పుట్టినరోజు వేడుకల కోసమే మహేశ్ కుటుంబం దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది.
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత ‘సర్కారువారి పాట’లో మహేశ్ నటించనున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా కీర్తి సురేశ్ సందడి చేయనున్నారు. త్వరలో ఈ సినిమా షూట్ దుబాయ్‌లో ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇందులో మహేశ్ పొడవాటి జుట్టు.. విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇందులోని పాత్ర కోసం ఆయన కాస్త బరువు తగ్గి మరింత స్టైలిష్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీస్, 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇదీ చదవండి
రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
రెండోసారి.. పంథా మారి
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’