మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది - my mother got emotional when wathed naandhi movie
close
Published : 24/02/2021 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌

హైదరాబాద్‌: ఎన్నో ఏళ్ల నుంచి కోలీవుడ్‌ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తెలుగులో వచ్చినంత ఆదరణ అక్కడ రాలేదని నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ అన్నారు. ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా సిని పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె కేవలం కథానాయికగానే కాకుండా ప్రతినాయకురాలిగా కూడా మెప్పిస్తున్నారు. ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’తో తెలుగులోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ‘క్రాక్‌’, ‘నాంది’లతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే తెలుగులో రెండు విజయాలు సొంతం చేసుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ‘నాంది’ గురించి స్పందిస్తూ..

‘నటిగా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టి తొమ్మిదేళ్లు అవుతోంది. తెలుగులో నాకు లభించినంత ఆదరణ కోలీవుడ్‌లో రాలేదు. నా సినిమాలు చూసి తెలుగులో మీకు మంచి అవకాశాలొస్తాయని చాలామంది చెప్పేవాళ్లు. ఇక్కడికి వచ్చాక అది నిజమని అర్థమైంది. ‘నాంది’లో నటించే అవకాశం వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. నా టీమ్‌ మొత్తానికి ధన్యవాదాలు. ఇటీవల చెన్నైకి వెళ్లిన సమయంలో అమ్మతో కలిసి ‘నాంది’ చిత్రాన్ని వీక్షించాను. ఆ సినిమా చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నేను కథానాయికగా నటించిన ‘తారై తప్పట్టై’ అనే తమిళ చిత్రం తర్వాత మా అమ్మ కన్నీళ్లు పెట్టుకున్న చిత్రమిదే’ అని వరలక్ష్మి పేర్కొన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని