నాంది ఓటీటీలో వచ్చేది అప్పుడే! - naandhi on aha
close
Updated : 08/03/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాంది ఓటీటీలో వచ్చేది అప్పుడే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్రమంగా నేరారోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడుపుతున్న ఓ యువకుడు దాని నుంచి ఎలా బయటకు వచ్చాడన్న నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’. అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందింది. ఇటీవలే థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. త్వరలోనే ఓటీటీలోనే సందడి చేసేందుకు సిద్ధమైంది. మార్చి 12 నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఈ సినిమా ప్రసారం కానుంది. సూర్య ప్రకాశ్‌ పాత్రలో జీవించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నరేశ్‌. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సతీశ్‌ వేగేశ్న నిర్మించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని