వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే కచ్చితంగా థర్డ్‌ వేవ్‌ - puri musings by puri jagannadh about side effects
close
Published : 13/05/2021 21:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే కచ్చితంగా థర్డ్‌ వేవ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: జ్వరం వస్తుందనో.. బ్లడ్‌ క్లాట్స్‌ అవుతాయనో భయపడి వ్యాక్సిన్‌ తీసుకోవడం మానేయొద్దని స్టార్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ ప్రజలను కోరారు. పూరి మ్యూజింగ్స్‌ పేరుతో వివిధ అంశాలపై ఆయన తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ గురించి మాట్లాడారు.

‘‘వ్యాక్సిన్‌ తీసుకోవాలంటే చాలామందిలో ఉన్న డౌట్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌. వేసుకుంటే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయోనని భయం. రోడ్డు మీద చెత్త నూనెలో వేసిన బజ్జీలు లొట్టలేసుకుంటూ తింటా. సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి ఆలోచించం.. ప్యాకెట్‌ సిగరెట్లు ఊది అవతల పడేస్తాం నో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. ఫుల్‌ బాటిల్‌ తాగేసి, రెండో బాటిల్‌ ఓపెన్‌ చేస్తున్నప్పుడైనా ఎవరైనా డాక్టర్‌కు ఫోన్‌ చేసి సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకుంటామా? అంటే అదీ లేదు. మనం తినే షుగర్‌, తాగే కూల్‌డ్రింక్స్‌, పిజ్జాలు, ఫ్రూట్‌ జ్యూస్‌లు, ఫ్రైడ్‌, గ్రిల్స్‌, పేస్ట్రీలు, కుకీస్‌, వీటంన్నింటి వల్ల మనలో ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. వాటిని పట్టించుకోం. కానీ, ఒక సైంటిస్ట్‌ మన కోసం వ్యాక్సిన్‌ తయారు చేసి, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ దాన్ని ఆమోదించి, మెడిసన్‌ చదువుకున్న డాక్టర్‌ మనల్ని వ్యాక్సిన్‌ వేసుకోమంటే మనకి దాని మీద అనుమానం. ‘అన్నా సైడ్‌ ఎఫెక్ట్‌ ఏమైనా ఉంటాయా’ అని అడుగుతాం’’

‘‘సైడ్‌ ఎఫెక్ట్స్‌ అన్నింటికీ ఉంటాయి. ఎఫెక్ట్‌ లేకపోతే సైడ్‌ ఎఫెక్ట్‌ ఉండదు. పందిలా తింటే పొట్ట వస్తుంది. ఎక్సర్‌సైజ్‌ చేస్తే కండ పెరుగుతుంది. తాగితే తల తిరుతుంది. ఇవన్నీ సైడ్‌ ఎఫెక్ట్స్‌. ఏ మెడిసిన్‌ తీసుకున్నా మనలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అలా ఉంటే అవి పనిచేస్తున్నాయని అర్థం. వ్యాక్సిన్‌ తీసుకుంటే బ్లడ్‌ క్లాట్స్‌ వస్తున్నాయని చాలా మంది భయపడి మానేస్తున్నారు. అవి కూడా లక్ష కేసుల్లో ఒక్కటి మాత్రమే. యూరప్‌లో 50లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇస్తే, 30మందికి మాత్రమే బ్లడ్‌ క్లాట్స్‌ వచ్చాయి. మనుషుల్లో బ్లడ్‌ క్లాట్స్‌ ఎందుకు వస్తాయో డెన్మార్క్‌లో 10ఏళ్లు పరిశోధన చేశారు. అన్ని వయసుల వారికి ఏదో కారణంగా ఈ బ్లడ్‌ క్లాట్స్‌ వస్తాయని తేలింది. వ్యాక్సిన్‌ వల్ల 30 కేసులు వస్తే, మామూలుగా 90 కేసులు వస్తున్నాయట. మనకు ఏదైనా దెబ్బ తగిలితే బ్లడ్‌ క్లాట్స్‌ వస్తాయి. వృద్ధులకు వయసు వల్ల బ్లడ్‌ క్లాట్స్‌ వస్తాయి. వీటికి భయపడి వ్యాక్సిన్‌ వేసుకోవడం మానేయొద్దు’’

‘‘డెవలప్‌ చేయడానికి పదేళ్లు పట్టే వ్యాక్సిన్‌ను సైంటిస్ట్‌లు ఎంతో కష్టపడి మన కోసం ఏడాదిలోనే తయారు చేశారు. అది చాలా గొప్ప విషయం. ‘పదేళ్లు పట్టాలి కదా! మేం నమ్మం’ అని అనవద్దు. వ్యాక్సిన్‌ కంటే మంచి మందు లేదు. బ్లడ్‌ క్లాట్స్‌ వస్తున్నాయట, జ్వరం వస్తుందట దాన్ని వదిలేయొద్దు. జ్వరం వస్తే వ్యాక్సిన్‌ పనిచేస్తోందని అర్థం. దయ చేసి వ్యాక్సిన్‌ను వృథా చేయొద్దు. దొరకడమే కష్టమైన రోజులివి. దొరికితే మాత్రం వెంటనే వెళ్లి వేయించుకోండి. మీరు టైమ్‌కు వెళ్లపోతే వ్యాక్సిన్‌లు వృథా అవుతాయి. అలా చాలా వ్యాక్సిన్‌లు వృథా అయ్యాయి. భారత్‌లో సగం జనాభా అయినా వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే, థర్డ్‌ వేవ్‌ కచ్చితంగా వస్తుంది’’ అంటూ పూరి చెప్పుకొచ్చారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని