అనురాగ్‌పై వేధింపుల ఆరోపణలు.. వర్మ మద్దతు - ram gopal varma about bollywood director anurag kashyap
close
Published : 21/09/2020 23:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనురాగ్‌పై వేధింపుల ఆరోపణలు.. వర్మ మద్దతు

విడాకుల తర్వాత కూడా సపోర్ట్‌ చేశాడన్న మాజీ భార్య

ముంబయి‌: బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి పాయల్‌ ఘోష్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అనురాగ్‌కు మద్దతు తెలుపుతూ.. తాప్సి, సయ్యామీ ఖేర్‌తోపాటు మరికొందరు మాట్లాడారు. తన మాజీ భర్త అనురాగ్‌ వ్యక్తిత్వం గొప్పదని నటి కల్కి కొచ్లిన్‌ తాజాగా పోస్ట్‌ చేశారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆయన తనకు అండగా ఉన్నారని, అలా ఎవరుంటారని ప్రశ్నించారు. ‘సోషల్‌ మీడియాలో జరుగుతున్న సర్కస్‌ చూసి బాధపడొద్దు. మహిళా స్వేచ్ఛ కోసం పోరాడే స్క్రిప్టులు రాసిన వ్యక్తివి నువ్వు. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ మహిళల్ని ఎంతో గౌరవిస్తుంటావు. ఇదంతా నేను స్వయంగా చూశా. విడాకులు తీసుకున్న తర్వాత కూడా నాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నావు. మన స్నేహానికి ముందు.. సినిమా సెట్‌లు, షూటింగ్‌లతో నేను అసౌకర్యంగా ఫీల్ అవుతున్న తరుణంలో ధైర్యం చెప్పావు’.

‘ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు, వాదనలు చేసే ఈ వింత పరిస్థితులు ప్రమాదకరమైనవి. ఇవి కుటుంబాలు, స్నేహితులు, దేశాల్ని నాశనం చేస్తున్నాయి. కానీ దీన్ని దాటితే.. ఓ గౌరవమైన స్థలం ఉంది. మీ చుట్టూ ఉన్నవారి అవసరాలను తీర్చే ప్రదేశం, ఇతరుల్ని ఆదుకునే ప్రదేశం, మీకు ఆ స్థలం గురించి బాగా తెలుసని నాకు తెలుసు. అక్కడే గౌరవంగా జీవించండి, దృఢంగా ఉండండి. మీ పనిని ఎప్పటిలాగే కొనసాగించండి. మీపై అభిమానంతో మీ మాజీ భార్య..’ అని కల్కి పేర్కొన్నారు.

వర్మ ట్వీట్‌

అనురాగ్‌పై వచ్చిన ఆరోపణలను ఉద్దేశించి దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు. ‘అనురాగ్‌ చాలా సున్నిత మనస్తత్వం కల్గిన ఎమోషనల్‌ వ్యక్తి. గత 20 ఏళ్లుగా అతడు నాకు తెలుసు.. ఇన్నేళ్లలో అనురాగ్‌ ఒకర్ని బాధించడం నేనెప్పుడూ చూడలేదు. ఆయన వల్ల ఇబ్బందిపడ్డామని ఇతరులు అనడం కూడా వినలేదు... కాబట్టి, ఒక్కసారిగా ఇప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని ఊహించలేకపోతున్నా..’ అని ఆయన చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని