శంకర్‌ చిత్రంలో రణ్‌వీర్‌ సరసన కియారా?  - ranveer singh to romance kiara advani in shankar’s next
close
Published : 23/03/2021 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శంకర్‌ చిత్రంలో రణ్‌వీర్‌ సరసన కియారా? 

ఇంటర్నెట్‌ డెస్క్:  బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్‌ పాన్‌ ఇండియా మూవీలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించనున్నారని వార్తలొస్తున్నాయి. ఇందులో కథానాయికగా కియారా అడ్వాణీ నటించనుందట. హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ విడుదలైన తర్వాత కియారాకి మంచి అవకాశాలే లభిస్తున్నాయి. ప్రస్తుతం శంకర్‌, రామ్ చరణ్ కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నీ సక్రమంగా జరిగితే రామ్‌ చరణ్‌ చిత్రం కంటే ముందుగానే రణ్‌వీర్‌ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది బాలీవుడ్ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం రణ్‌వీర్‌ - కపిల్‌దేవ్‌ జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘83’ చిత్రంలో నటించారు. ఈ ఏడాది జూన్‌ 4న సినిమా విడుదల కానుంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో ‘సర్కస్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక కియారా సైతం ‘భూల్‌ భులయ్యా 2’, ‘జగ్‌ జుగ్‌ జీయో’లాంటి సినిమాల్లో  బిజీగా ఉంది. దర్శకుడు శంకర్‌ ఇప్పటికే కమల్‌హాసన్‌ కథానాయకుడిగా ‘ఇండియన్‌ 2’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అరవై శాతంపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మరి శంకర్‌ ఏ సినిమాని ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తాడో వేచి చూడాల్సిందే.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని