సుధీర్‌ని ఇకపై అలా పిలుస్తా: రష్మి - rashmi about sudheer dhee 13kings vs queens latest promo out now
close
Published : 25/06/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుధీర్‌ని ఇకపై అలా పిలుస్తా: రష్మి

ఇంటర్నెట్ డెస్క్‌: ‘ఈరోజు నుంచి సుధీర్‌ని నేను సుట్టి అని పిలుస్తా’ అంటూ సందడి చేసింది రష్మి.  ప్రదీప్‌ వ్యాఖ్యాతగా.. సుధీర్‌, రష్మి.. టీం లీడర్లుగా ఈటీవీలో ‘ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ రియాలిటీ షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. జూన్‌ 30 (బుధవారం) టెలికాస్ట్‌ అయ్యే ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులోనే సుధీర్‌ని సుట్టి అని పిలుస్తా అంటూ రష్మి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘ఆట’ సినిమాలోని ‘ఏం చాందిని రా’ అనే పాటకు డ్యాన్స్‌ చేసి కనువిందు చేశారు. ఎపిసోడ్‌కే స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. మరోవైపు రష్మి మాటల్ని ప్రదీప్‌ ఇమిటేట్‌ చేయడం నవ్వులు పూయించింది. డ్యాన్స్‌ కంటెస్టెంట్లు తమ తమ ప్రదర్శనలతో అదరగొట్టారు. వీళ్ల ప్రతిభని చూసి ప్రియమణి సైతం కాలు కదిపారు. ఈ హంగామా అంతా చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. అప్పటి వరకు ఈ ప్రోమో వీడియో చూసి ఆనందించండి... 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని