‘ఆర్‌సి 15’లో జర్నలిస్టుగా రష్మిక? - rashmika as a journalist in ramcharan movie rc15
close
Published : 15/04/2021 23:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?

ఇంటర్నెట్ డెస్క్: రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ‘ఆర్‌సి 15’వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటించనుందని సమాచారం. అయితే ఆమె ఇందులో జర్నలిస్టుగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శంకర్ చెప్పిన కథ నచ్చడంతో నటించేందుకు అంగీకరించిందట. అయితే అధికారికంగా చిత్రబృందం ఎక్కడా ప్రకటించలేదు. సినిమా జులై 15న సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

రాజకీయ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కనుందని రామ్‌చరణ్‌ ఇందులో ముఖ్యమంత్రిగా కనిపించనున్నారని ముమ్మరంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో పాటు చిరంజీవి కూడా నటిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది సినిమాని తెలుగు, తమిళం, హిందీలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’, హీరో శర్వానంద్‌తో కలిసి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో నాయికగా నటిస్తోంది. ఇక హిందీలో సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తోన్న ‘మిషన్‌ మజ్ను’తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ చిత్రంలో నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని