దయచేసి జనాల్ని భయపెట్టకు: RRR టీమ్‌ - rrr team funny replay to netizen
close
Updated : 02/04/2021 16:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దయచేసి జనాల్ని భయపెట్టకు: RRR టీమ్‌

నెటిజన్‌ ట్వీట్‌కు చిత్రబృందం రిప్లై

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌ విశేషాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా ట్విటర్‌ వేదికగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు వరుస పోస్టులు పెడుతున్నారు. నెటిజన్లు చేసిన ట్వీట్లకు టీమ్‌ సైతం పలు సందర్భాల్లో స్పందిస్తోంది. తాజాగా ఓ మహిళా అభిమాని.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని సీత పాత్ర రీ-క్రియేట్‌ చేస్తూ కొన్ని ఫొటోలు దిగి, చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘వావ్‌’ అని సదరు చిత్రబృందం రిప్లై ఇచ్చింది.

కాగా, ఇప్పటివరకూ తాను పెట్టిన పోస్టులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసిగిపోయిన ఓ నెటిజన్.. ‘ఆలస్యం చేయకుండా త్వరగా సీత కాస్ట్యూమ్స్‌ కొని ఫొటోషూట్‌ చేసి పంపుతా. అప్పుడు కానీ నువ్వు నాకు రిప్లై ఇచ్చేలా లేవు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మావ’ అని ట్వీట్‌ చేశాడు. నెటిజన్‌ పెట్టిన కామెంట్‌పై సరదాగా స్పందించి టీమ్‌.. ‘అలాంటి పనులు చేసి జనాల్ని భయపెట్టకు’ అని రిప్లై ఇచ్చింది. అలాగే మరో నెటిజన్‌.. ‘ఆలియాభట్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది కదా. మరి షూట్‌ ఏమైనా ఆలస్యమయ్యే అవకాశముందా?’ అని కామెంట్‌ చేయగా.. ‘నో. ఆలస్యమయ్యే అవకాశమే లేదు’ అని సమాధానమిచ్చింది.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని