సాయితేజ్‌ ‘రిపబ్లిక్‌’ఫస్ట్‌లుక్‌ ఇదిగో! - sai tej new movie republic firstlook
close
Updated : 25/03/2021 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాయితేజ్‌ ‘రిపబ్లిక్‌’ఫస్ట్‌లుక్‌ ఇదిగో!

హైదరాబాద్‌: మెగా వారసుడు సాయితేజ్‌ హీరోగా ‘రిపబ్లిక్‌’తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రస్థానం’ఫేమ్‌ దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నటుడు రామ్‌చరణ్‌ విడుదల చేశారు. చిత్రబృందానికి ‘అల్‌దిబెస్ట్‌’ చెప్పారు. పోస్టర్‌ రిలీజ్‌ చేసినందుకు సాయితేజ్‌ కృతజ్ఞతలు తెలిపారు. సాయితేజ్‌ ‘అభి’గా ఈ చిత్రంలో కనిపించనున్నారు. పెన్సిల్‌ స్కెచ్‌ వంటి చిత్రంతో ఉన్న పోస్టర్‌పై ‘డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు!’ అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తన్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై భగవాన్‌, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌4న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే సాయితేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటరు’చిత్రంతో ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని