సమంత తొలి వెబ్‌సిరీస్‌ వచ్చేస్తోంది - samantha akkineni the family man 2 to release on amazon prime on feb 12
close
Updated : 07/01/2021 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత తొలి వెబ్‌సిరీస్‌ వచ్చేస్తోంది

ముంబయి: టాలీవుడ్‌ అగ్రకథానాయిక అక్కినేని సమంత తొలిసారిగా ఓ వెబ్‌సిరీస్‌తో మనముందుకు రాబోతోంది. ఆమె నటించిన వెబ్‌సిరీస్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌2’ విడుదలకు సిద్ధమైంది. తాజాగా దర్శకనిర్మాతలు విడుదల తేదీని ప్రకటించారు కూడా. ఫిబ్రవరి 12నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సిరీస్‌ అలరించనుంది. ఇందులో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మనోజ్‌బాజ్‌పాయ్‌ ప్రధానపాత్రలో కనిపించనున్నాడు. థ్రిల్లర్‌ కాన్సెప్టుతో వస్తున్న ఈ సిరీస్‌లో సమంత కీలక పాత్ర పోషించింది.

సెప్టెంబర్ 2019‌లో విడుదలైన ‘ఫ్యామిలీ మ్యాన్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో దానికి కొనసాగింపుగా ‘ఫ్యామిలీ మ్యాన్‌2’ను తీసుకురావాలని దర్శక-నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ సిరీస్‌ రాజ్‌, డీకే దర్శకత్వంలో తెరకెక్కింది. కాగా.. ఇందులో సమంత మునుపటి గ్లామరస్‌ పాత్రలతో పోలిస్తే పూర్తి భిన్నంగా కనిపించనుంది. తనకు మొదటి వెబ్‌సిరీస్‌ కావడంతో సమంత చాలా కష్టపడి పనిచేసిందట. ఇందులో ప్రియమణి, షరీబ్ హష్మి, సీమా బిస్వాస్, దర్శన్ కుమార్, శరద్ కేల్కర్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇది హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అలరించనుంది. 

ఇవీ చదవండి!

సోనూసూద్‌పై కేసు నమోదు చేయండి: బీఎంసీ
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని