Cinema news: ఓ పని పూర్తయింది..! - sampoornesh babu and saptagiri new films wrapped shoot
close
Published : 25/06/2021 18:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: ఓ పని పూర్తయింది..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే షూటింగ్‌ల సందడి మొదలైంది. కొన్ని కొత్త చిత్రాలు పట్టాలెక్కుతుండగా మరికొన్ని ఆఖరి దశ షెడ్యూల్‌ ముగించుకుని పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే సంపూర్ణేశ్‌ బాబు, సప్తగిరి సినిమాల షూటింగ్‌ పూర్తయింది. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాయి ఆయా చిత్ర బృందాలు.

సంపూ.. ‘క్యాలీఫ్లవర్‌’

సంపూర్ణేశ్‌ బాబు హీరోగా ఆర్‌.కె.మలినేని  తెరకెక్కిస్తోన్న చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’. రాధాకృష్ణ టాకీస్‌ పతాకంపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రజ్వాల్‌ క్రిష్‌ సంగీతం అందిస్తున్నారు. ‘మా బ్యానర్‌లో సంపూర్ణేశ్‌ బాబు నటిస్తోన్న ‘క్యాలీఫ్లవర్‌’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే థియేటర్లో విడుదల చేస్తాం’ అన్నారు చిత్ర నిర్మాత.

టైటిల్‌ త్వరలో..

సప్తగిరి ప్రధాన పాత్రలో కె.ఎం. కుమార్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. ఎస్‌.ఆర్‌.ఆర్‌. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిందని, టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని