పవన్‌తో అకీరా.. స్మార్ట్‌గా మెగాస్టార్‌ - star hero photos goes viral in internet in recent times
close
Published : 31/05/2021 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌తో అకీరా.. స్మార్ట్‌గా మెగాస్టార్‌

పాతదో.. కొత్తదో.. కానీ వైరలైంది

హైదరాబాద్‌: ఓవైపు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ఫొటోలతో నెట్టింట్లో ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ వాయిదా పడడంతో సినీ హీరోలెవరూ కూడా పెద్దగా బయటకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా మాస్క్‌లు లేకుండా కనిపించడం లేదు. దీంతో తమ అభిమాన హీరోలకు సంబంధించిన ఏ ఒక్క ఫొటో బయటకు వచ్చినా అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. అలా ఇటీవల నెట్టింట్లో దర్శనమిచ్చిన క్లిక్స్‌పై ఓ లుక్కేద్దాం..

కూల్‌ అండ్‌ స్మార్ట్‌గా చిరు

మెగాస్టార్‌ చిరంజీవికి సంబంధించి ఓ ఫొటోని ఇటీవల ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ దబూ రత్నానీ సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. ఇందులో చిరు.. కూల్‌, స్మార్ట్‌లుక్‌లో యువకుడిగా దర్శనమిచ్చారు. అయితే ఈ ఫొటో చూసిన మెగా అభిమానులు కొంతమంది ఇది లేటస్ట్‌ ఫొటోయేనా? అని దబూకి కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌.. చాలాకాలం క్రితమే ఈ ఫొటో బయటకు వచ్చిందని.. కాకపోతే ఇప్పుడు మళ్లీ ఆయన కొత్తగా షేర్‌ చేశారని అన్నారు. ఏది ఏమైనా ఈ ఫొటో మాత్రం ఇటీవల నెట్టింట్లో వైరల్‌గా మారింది.


పవర్‌స్టార్‌తో జూనియర్‌ పవర్‌స్టార్

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. ఆయన తనయుడు అకీరా నందన్‌ కలిసి దిగిన ఫొటోలు చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి. వీళ్లిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు ఇక పండుగే. తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అకీరా నందన్‌కు సంగీతమంటే ఎంతో ఇష్టం. దీంతో అకీరా ఓ ప్రముఖ మ్యూజిక్‌ టీచర్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. అలా ఆ మ్యూజిక్‌ టీచర్‌తో కలిసి పవన్‌, అకీరా ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. కొంతమంది ఈ ఫొటోను లేటస్ట్‌ అంటుంటే.. మరికొంతమంది మాత్రం పాత ఫొటో అంటున్నారు.


యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆయన బయటకు వచ్చిన దాఖలాలు లేవు. తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఫొటో మాత్రం నెట్టింట్లో అందర్నీ ఆకర్షిస్తోంది. ఇందులో ఆయన సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఆదివారం ఎన్టీఆర్‌ రెండో తనయుడు భార్గవ్‌ రామ్‌ అక్షరాభాస్యం జరిగిందని.. ఇందులో భాగంగానే ఓ పూజారితో ఎన్టీఆర్‌ ఫొటోలకు పోజ్‌ ఇచ్చారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని