ఎనిమిదేళ్ల  తర్వాత దక్కిన విజయం ‘నాంది’ - success after eight years beginning
close
Published : 19/02/2021 21:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎనిమిదేళ్ల  తర్వాత దక్కిన విజయం ‘నాంది’

హైదరాబాద్: అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నాంది’. శుక్రవారం (19న) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నరేష్ భావోద్వేగంగా మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ‘సుడిగాడు’ తర్వాత నాకు సరైన విజయం దక్కలేదు. ఒక హాస్య నటుడు వరసగా ఎనిమిది సినిమాలు అపజయం పొందినా.. నా మీద నమ్మకంతో సీరీయస్ నేపథ్యంలో ఓ సినిమా చేద్దామని నిర్మాత సతీష్ నన్ను ప్రొత్సహించారు. ఇక దర్శకుడు విజయ్.. గట్స్‌తో నాతో ఈ పాత్ర చేయించారు. అతడికి ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలని ఉదయం నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. నా తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి గుర్తింపు వచ్చింది. మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌కు ఈ సినిమా నాకు లైఫ్ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించిన వరలక్ష్మికి మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నా. ఈ చిత్రానికి సంగీతం అందించిన శ్రీచరణ్, సినిమాటోగ్రాఫర్ సిద్, కళా దర్శకుడు కడలి బ్రహ్మ అందరూ మనసు పెట్టి చేశారు. వాళ్ల వల్లే ఈ విజయం సాధ్యమైంది. చిత్ర విజయంతో నాకు మాట్లాడ్డానికి మాటలు రావడం లేదు’’ అని నరేశ్‌ అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని