Taapsee: ఆ పదం అర్థంకాక.. గూగుల్‌ చేశా.. తెలిసి షాకయ్యా! - taapsee pannu didn’t know about gender testing in sports google it rashmi rocket star
close
Published : 02/10/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Taapsee: ఆ పదం అర్థంకాక.. గూగుల్‌ చేశా.. తెలిసి షాకయ్యా!

ముంబయి: ‘‘ఒక కథలో నటించాలంటే దానిమీద పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే ఆ పాత్రలో లీనమై సంపూర్ణంగా న్యాయం చేసిన వాళ్లమవుతాం. తాజాగా నేను నటించిన ‘రష్మీ రాకెట్‌’ నాకు ఇదే విషయం నేర్పింది’ అని అంది బాలీవుడ్‌ నటి తాప్సీ. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. విభిన్న కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ఈసారి క్రీడానేపథ్యం ఉన్న స్ర్కిప్ట్‌ని ఎంచుకుంది. గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీ పాత్రలో తాప్సీ కనిపించనుంది. ఈ సినిమా ఓ అంశం చుట్టూ నడుస్తుందని.. దానికి సంబంధించిన ఓ పదం అర్థం కాక గూగుల్‌ చేశానని చెప్పింది.

‘‘ఓ రోజు ‘రష్మీ రాకెట్‌’ స్క్రిప్ట్‌ చెప్పేందుకు రచయిత నందా పెరియసామి నన్ను కలిశారు. కథని ఓ వీడియో రూపంలో తీసుకొచ్చి చూపించారు. అది చాలా చక్కగా ఉంది. నిజానికి నేను స్పోర్ట్స్‌ చూడటం ఇష్టపడతా. ఫాలోఅవుతుంటాను కూడా. అలాంటిది ఇందులో ముఖ్యమైన అంశం స్పోర్ట్స్‌కి సంబంధించి చేసే ‘‘లింగనిర్ధారణ’’ గురించి అర్థం కాక వెంటనే గూగుల్‌ చేశా. ప్రత్యేకించి ఈ విషయం గురించి వివరాలు తెలుసుకున్నాక షాక్‌ అయ్యా. ఇందులో తాప్సీ భర్తగా నటించిన  ప్రియాంశు కూడా ఇదే మాట అన్నారు. ఈసినిమా షూట్‌ చేస్తున్నప్పుడే లింగనిర్ధారణ గురించి తెలుసుకున్నా. అయితే ఇది నిజంగా ఉంటుందా? లేదా సినిమా కోసమని సృజనాత్మకంగా జోడించిన అంశమేమోనని చెక్‌ చేసుకోమన్నా. ఎప్పుడైతే ఇదంతా నిజంగా జరుగుతుందోనని తెలిసిందో ఆశ్చర్యానికి గురయ్యా. ఈ చిత్రం ద్వారా.. సమాజంలో ఈ సమస్యని ఎత్తిచూపుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రోనీ స్ర్కూవాలా, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 15న జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని