shyamsingharoy: అతని ప్రేమ.. అతని వారసత్వం - telugu news Dasara Surprise from shyamsingharoy
close
Updated : 15/10/2021 07:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

shyamsingharoy: అతని ప్రేమ.. అతని వారసత్వం

నాని కథానాయకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నాయికలు. ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే శ్యామ్‌ సింగరాయ్‌గా ఆయన లుక్‌ను చూపించిన చిత్ర బృందం.. ఇప్పుడు వాసుగా మరో పాత్రకు సంబంధించిన లుక్‌ను ప్రేక్షకులకు చూపించింది. దసరా సందర్భంగా గురువారం ఈ పాత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వాసుగా నాని గుబురు గడ్డం.. వెరైటీ హెయిర్‌ కట్‌తో ఆకట్టుకునేలా కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో కాళీమాత విగ్రహాన్ని చూపించారు.  ప్రేమ.. అతని వారసత్వం.. అతని మాట’’ అంటూ పోస్టర్‌పై ఓ వ్యాఖ్యను చూపించారు. కలకత్తా నేపథ్యంలో సాగే ఓ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. పునర్జన్మల నేపథ్యం కనిపిస్తుంది.సినిమాని ఈ ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని