Ramayan: అలనాటి రావణుడు ఇక లేరు - telugu news actor arvind trivedi dies of a heart attack
close
Updated : 06/10/2021 11:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ramayan: అలనాటి రావణుడు ఇక లేరు

ముంబయి: రావణుడిగా ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్‌ విలక్షణ నటుడు అరవింద్‌ త్రివేది (82) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన మంగవారం రాత్రి గుండెపోటుతో ముంబయిలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అరవింద్‌ త్రివేది మరణవార్తతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణం తమని ఎంతో కలచి వేసిందని సునీల్‌ లహ్రీ, అరుణ్‌ గోవిల్‌ అన్నారు. మరోవైపు అరవింద్‌ త్రివేది మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. అరవింద్‌ గొప్ప నటుడు మాత్రమే కాదని.. మంచి ప్రజాసేవకుడు కూడా అని మోదీ కొనియాడారు. ‘రామాయణ్‌’ ధారావాహిక వల్ల ఆయన ఎన్నో తరాల వారికి గుర్తుండిపోతారని తెలిపారు.

రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ‘రామాయణ్‌’ సీరియల్‌లో అరవింద్‌ త్రివేది రావణుడి పాత్ర పోషించారు. ఆ సీరియల్‌తో ఆయన విశేష ప్రేక్షకాదరణ పొందారు. 300లకు పైగా సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన ఎంపీగాను బాధ్యతలు నిర్వర్తించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని