Sunil Shetty: డ్రగ్స్ కేస్‌లో దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచిచూడాలి.. - telugu news bollywood actor sunil shetty about aryan khan arrest
close
Published : 04/10/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sunil Shetty: డ్రగ్స్ కేస్‌లో దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచిచూడాలి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంచలనంగా మారిన ముంబయి డ్రగ్స్‌ కేస్‌ విషయంపై బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి స్పందించారు. ఈ కేసులో పట్టుబడ్డ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ సహా మిగతా కుర్రాళ్ల విషయంలో దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. నిజమైన నివేదిక వచ్చిన తర్వాతే ఓ అంచనాకి రావాలన్నారు. ఎవరైనా ఇలాంటి కేసుల్లో పట్డుబడితే అనేక రకాలుగా ఊహించుకోవడం సహజమని పేర్కొన్నారు. కుర్రాళ్లని సంరక్షించుకోవడం మన బాధ్యత అని అన్నారు. ముంబయి నగర శివారులోని తీరప్రాంతంలో క్రూజ్‌ నౌకపై శనివారం నిర్వహించిన ఓ రేవ్‌పార్టీలో ఆర్యన్‌తోపాటు మరికొందరు హాజరయ్యారు. అక్కడ మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌. సి.బి) అధికారులు సోదా చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆర్యన్‌తో సహా పలువురిని అరెస్ట్‌ చేశారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని