RRR: ఎన్టీఆర్‌కి గాయంపై ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ క్లారిటీ - telugu news it is make up only says rrr team
close
Updated : 08/08/2021 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: ఎన్టీఆర్‌కి గాయంపై ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ క్లారిటీ

వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల ఎదురుచూపులకు సమాధానం చెప్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ ఉక్రెయిన్‌లో శరవేగంగా జరుగుతోంది. తారక్‌-ఎన్టీఆర్‌-ఒలీవియా మోరీస్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. విరామ సమయంలో తారక్‌-చెర్రీ మాట్లాడుకుంటుంటే రాజమౌళి దాన్ని షూట్‌ చేస్తున్నట్లు ఉన్న ఓ సరదా వీడియోని శనివారం చిత్రబృందం షేర్‌ చేసింది. అయితే, ఆ వీడియోలో ఎన్టీఆర్‌ నుదుటిపై చిన్నగాయమైనట్లు కనిపిస్తోంది. అది చూసిన తారక్‌ అభిమానులు ఆందోళన చెందారు. ఏమైందంటూ వరుస పోస్టులు పెట్టారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఓ అభిమాని.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ని ట్యాగ్‌ చేస్తూ.. ‘ఎన్టీఆర్‌కు ఆ దెబ్బేంటన్నా?’ అని ట్వీట్‌ చేయగా.. ‘అది దెబ్బ కాదు మేకప్‌ మాత్రమే’ అని చిత్రబృందం స్పందించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ రిప్లైతో అభిమానులందరూ ఊపిరిపీల్చుకున్నారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా.. తారక్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని