Bigg Boss Telugu 5: షణ్ణూ.. సలహాలివ్వడం తగ్గించుకుంటే మంచిది: సిరి  - telugu news latest episode of biggboss telufu 5
close
Published : 15/10/2021 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: షణ్ణూ.. సలహాలివ్వడం తగ్గించుకుంటే మంచిది: సిరి 

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ పేరుతో నిర్వహించిన కెప్టెన్సీ టాస్క్‌ ముగిసింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ఊహించని షాక్‌ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న కుషన్స్‌ని చించి బొమ్మలు తయారు చేసిన రవి టీమ్‌ పోటీ నుంచి డిస్‌క్వాలిఫై అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. సంచాలకులుగా వ్యవహరించిన కాజల్‌, సిరిలను కూడా కెప్టెన్‌ అయ్యేందుకు అర్హత లేదని చెప్పడంతో వాళ్లిద్దరూ బాధపడ్డారు. స్పెషల్‌ పవర్‌తో శ్రీరామ్‌ టీమ్‌.. షణ్ముఖ్‌ టీమ్‌ వద్ద ఉన్న బొమ్మలను సగం తీసేసుకుంది. దీంతో కెప్టెన్‌ పోటీదారులుగా బ్లూ టీమ్‌ సభ్యులైన సన్నీ, మానస్‌, అనీ మాస్టర్‌.. రెడ్‌ టీమ్‌ సభ్యులైన ప్రియ, విశ్వ, శ్రీరామ్‌లు పోటీలో నిలిచారు. వీరికి హర్డిల్స్‌ దాటుకుని ఇసుక నింపే టాస్క్‌ ఇవ్వగా.. అందులో విశ్వ విజయం సాధించి హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం కాజల్‌ మానస్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘ఇంట్లో ముగ్గురు వ్యక్తులు నీ కోసం కొట్టుకుంటున్నారు’ అని కాజల్‌ చెప్పగా... ‘ఎవరా ముగ్గురు..?’ అని మానస్‌ అడిగాడు. ‘ఆ విషయం నేను చెప్పను’ అని కాజల్‌ అనగా.. ‘ప్రియాంక, కాజల్‌లు నా కోసం కొట్టుకుంటున్నారా?’ అని అడిగాడు. ప్రియ కూడా నీ విషయంలో కేర్‌ తీసుకుంటారు అని కాజల్‌ చెప్పింది. (గతంలో ఒకానొక సమయంలో మానస్‌ తనకు కొడుకులాంటి వాడు అని ప్రియ చెప్పిన విషయం తెలిసిందే). అనంతరం, రేషన్‌ మేనేజర్‌ ఎంపికపై బిగ్‌బాస్‌ చిన్న టాస్క్‌ ఇచ్చాడు. అందులో సన్నీ, ప్రియాంక, మానస్‌ పోటీ పడ్డారు. సరదాగా సాగిన ఈ టాస్క్‌లో మానస్‌.. ప్రియాంకను గెలిపించాడు.

సిరిని బతిమలాడిన షణ్ముఖ్‌

కెప్టెన్సీ టాస్క్‌ సందర్భంగా.. ‘అందరితో నవ్వుతూ ఉంటే నువ్వు ఓడిపోతావ్‌’ అని జెస్సీ ప్రియాంకతో అన్నాడు. ధైర్యంగా పోరాడాలని సూచించాడు. ఆ తర్వాత షణ్ముఖ్‌, సిరి, జెస్సీల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘ఉచిత సలహాలు ఇవ్వకు’ అంటూ షణ్ముఖ్‌.. జెస్సీకి బోధించాడు. అక్కడే ఉన్న సిరి.. ‘నువ్వు కూడా సలహాలు ఇవ్వడం తగ్గించుకుంటే బాగుంటుంది’ అని షణ్ముఖ్‌ని అంది. ‘అన్నింటిలో ఎందుకు కలుగచేసుకుంటున్నావ్‌..’ అంటూ సిరిపై షణ్ము ఫైర్‌ అయ్యాడు. దీంతో కోపం తెచ్చుకున్న సిరి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్ది సేపటి తర్వాత షణ్ముఖ్‌ వెళ్లి సిరిని బతిమలాడు. 

మానస్‌కు బొట్టు పెట్టిన ప్రియాంక

హౌస్‌లో అందరూ నిద్రపోయిన తర్వాత మానస్‌ దగ్గరకు వెళ్లిన ప్రియాంక.. అతని ముఖంపై ఉన్న దుప్పటి తీసి బొట్టు పెట్టింది. ఈ సందర్భంగా సిరి, ప్రియ, శ్వేత, ప్రియాంకల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘మానస్‌ బాగుంటాడు కదా’ అని సిరి.. ప్రియాంకను ఉడికించగా.. ‘నీ దిష్టే తగిలేలా ఉంది’ అని ప్రియాంక అనడంతో నవ్వులు పూస్తాయి. అలా, కాసేపు వాళ్లందరి మధ్య మానస్‌ గురించి చర్చ జరిగింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని