Porn Videos Racket: నాతో బలవంతంగా పోర్న్‌ వీడియోలు చేయించారు - telugu news new case on actress gehana vasisth and producers
close
Published : 29/07/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Porn Videos Racket: నాతో బలవంతంగా పోర్న్‌ వీడియోలు చేయించారు

నటి గహనాపై ఫిర్యాదు చేసిన బాధితురాలు

గహనా వశిష్ఠ్‌

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా ముంబయి చెందిన ఓ నటి.. హాట్‌షాట్స్‌ కోసం తనతో బలవంతంగా పోర్న్‌ వీడియోలు చేయించారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో నటి గహనా వశిష్ఠ్‌తోపాటు రాజ్‌కుంద్రా సంస్థకు చెందిన నలుగురిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. దీంతో రాజ్‌కుంద్రా హాట్‌షాట్స్‌ వ్యవహారం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గహనా వశిష్ఠ్‌ సహా 10 మందిని ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఎన్నో విస్తుపోయే నిజాలు తెలిశాయి. అందులో భాగంగా నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను జులై 19న అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలోనే రాజ్‌కుంద్రాకు చెందిన హాట్‌షాట్స్‌ యాప్‌, దాని నిర్వాహకులపై పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని