Evaru Meelo Koteeswarulu: ఒక్క సెకను ఉందనగా చరణ్‌ చెప్పిన సమాధానమిదే! - telugu news questions of meelo evaru koteeswarulu
close
Updated : 23/08/2021 18:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Evaru Meelo Koteeswarulu: ఒక్క సెకను ఉందనగా చరణ్‌ చెప్పిన సమాధానమిదే!

శ్రీశ్రీ కవితతో అదరగొట్టిన తారక్‌

హైదరాబాద్‌: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రసారమవుతోంది. ఆట తీరు.. అందులో ఉండే విధివిధానాలను ప్రేక్షకులకు సులువుగా తెలియజేసేందుకు మొదటిగా కర్టన్‌రైజర్‌ ప్రసారం చేశారు. ఇందులో రామ్‌చరణ్‌ సందడి చేశారు. షోలో ఎంత గెలిస్తే అంత చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేస్తానంటూ ఆయన ఆట మొదలు పెట్టారు. ఇప్పటివరకు రూ.80,000 గెలుచుకుని ముందుకు సాగుతున్నారు. మరి, చరణ్‌ని తారక్‌ అడిగిన ప్రశ్నలేంటి.. వాటి సమాధానాలేంటి? ఓసారి తెలుసుకుందాం!


1.వీటిలో ‘గురువు’ అనే అర్థం కలిగిన పదం ఏది?  
ఎ) ఆరోగ్య బి) ఆచార్య సి) ఐశ్వర్య డి) ఆశ్చర్య

సమాధానం: ఆచార్య


2.హిందూ పురాణాలలో వీటిలో ఏది తాగటం వలన అమరత్వం వస్తుంది?
ఎ) కాలకూటం బి) హలాహలం సి) అమృతం డి) నాలికము

సమాధానం: అమృతం


3. వీటిలో ఎస్‌ఎల్‌ఆర్‌, డీఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్‌స్టెంట్‌ అనేవి దేనిలో రకాలు?
ఎ) కెమెరాలు 
బి) పుస్తకాలు సి) విమానాల డి) వజ్రాలు

సమాధానం: కెమెరాలు


4.ఈ ఆడియో క్లిప్‌లోని గాయకుడు ఎవరు? (నువ్వు సారా తాగుట మానురన్నో లేకుంటే సచ్చి ఊర్కుంటావురన్న)

ఎ) రమణ గోగుల బి) పవన్‌ కల్యాణ్‌ సి) దేవిశ్రీ ప్రసాద్‌ డి) మణిశర్మ

సమాధానం: పవన్‌ కల్యాణ్‌5. వీటిలో క్రికెట్‌ ఫీల్డింగ్‌ పొజిషన్‌ కానిది ఏది?
ఎ) కవర్‌ పాయింట్‌ బి) స్లిప్‌ సి) గల్లీ డి) వింగ్‌బ్యాక్‌

సమాధానం: వింగ్‌ బ్యాక్‌

(ఈ ప్రశ్నకు చరణ్‌ నిర్ణీత సమయం ఇంకా ఒక సెకనులో అయిపోతుందనగా సమాధానం చెప్పారు)


6. ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం ఏ నగరంలో ఉంది?
ఎ) న్యూయార్క్‌ బి) సిడ్నీ సి) ఆమ్‌స్టర్‌డ్యాం డి) లండన్‌

సమాధానం: సిడ్నీ


7. పెటా సంస్ధ వీటిలో దేనికి సంబంధించినది?
ఎ) మహిళల భద్రత బి) మానవ హక్కులు సి) జంతువుల హక్కులు డి) శరణార్థుల హక్కులు

సమాధానం: జంతువుల హక్కులు


8.జూన్‌ 2021 నాటికి వీరిలో ఎవరి పేరుతో తెలంగాణలో ఒక జిల్లాకు పేరు పెట్టారు?
ఎ) ఏపీజే అబ్దుల్‌ కలాం బి) ఎస్‌.రాధాకృష్ణన్‌ సి) పీవీ నరసింహారావు డి) కుమురం భీం

సమాధానం: కుమురం భీం


ఇలా ఎనిమిది పశ్నలకు సమాధానం చెప్పిన చెర్రీ ఆటలో విజయం సాధించడానికి ముందుకు కొనసాగుతున్నారు. గెలుపొందిన మొత్తాన్ని ఓ గొప్ప కార్యం కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో షోలో అడుగుపెట్టిన చరణ్‌ ఎంత గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే వేచి చూడాలి. తారక్‌-చరణ్‌లతోపాటు సెట్‌లో రానా కూడా వర్చువల్‌గా సందడి చేస్తే.. వీళ్ల ముగ్గురి సంభాషణ ఎంత సరదాగా ఉంటుందో తెలుసుకోవాలంటే సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌ను చూడాల్సిందే.

శ్రీశ్రీ కవితతో అదరగొట్టిన తారక్‌..

దేహానికి తప్ప,

దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...    

తలుచుకుంటే..

నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...

నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది.

అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...

పారే నది..,

వీచే గాలి...,

ఊగే చెట్టు...,

ఉదయించే సూర్యుడు....

అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా...

ఏదీ ఏదీ ఆగిపోడానికి వీల్లేదు..!!

‘మహాకవి శ్రీశ్రీ గారి పదాల సాక్షిగా చెబుతున్నా. జీవితం జీవనది లాంటిది. ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఆగిపోకుండా మనం అనుకున్నది సాధించాల్సింది మనమే. మనందరం కలిసి కట్టుగా పాటించాల్సిన నియమాలను పాటిస్తే ఈ కష్టాన్ని అలా దాటేస్తాం. ఈ కరోనా మహామ్మారిని చేధించేస్తాం. జీవితం మున్ముందుకు సాగిపోవాలి’ అంటూ కరోనా నేపథ్యంలో మనం ముందుకెలా సాగాలో వ్యాఖ్యానిస్తూ ఎన్టీఆర్‌ షోని ప్రారంభించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని