RRR: ఉక్రెయిన్‌లో చెర్రీ-తారక్‌ల కారు ట్రిప్‌.. వీడియో వైరల్‌ - telugu news ramcharan and ntr chill with dosti song in ukraine
close
Published : 11/08/2021 15:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: ఉక్రెయిన్‌లో చెర్రీ-తారక్‌ల కారు ట్రిప్‌.. వీడియో వైరల్‌

హైదరాబాద్‌: ఉక్రెయిన్‌ వీధుల్లో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్ ‌- యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరదాగా సేదతీరుతున్నారు. కొంత సమయంపాటు కారులో అలా రైడ్‌కు వెళ్లి వచ్చారు. ఈ ట్రిప్‌లో మరింత జోష్‌ పొందేందుకు ‘దోస్తీ’ పాట వింటూ లిరిక్స్‌ హమ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నెట్టింట్లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి విడుదలైన ‘దోస్తీ పాట అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అత్యధిక బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మక చిత్రం రూపుదిద్దుకుంటోంది. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ పాత్రలు పోషించారు. చెర్రీకి జోడీగా ఆలియాభట్‌, తారక్‌ ప్రియురాలిగా ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ‘మేకింగ్‌’ వీడియో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని