RC 15: రామ్‌చరణ్‌-శంకర్‌ ప్రాజెక్ట్‌ హీరోయిన్‌ ఫిక్స్‌..! చెర్రీతో రెండోసారి జోడీ కట్టనున్న బ్యూటీ - telugu news rc 15 heroine fix
close
Updated : 31/07/2021 10:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RC 15: రామ్‌చరణ్‌-శంకర్‌ ప్రాజెక్ట్‌ హీరోయిన్‌ ఫిక్స్‌..! చెర్రీతో రెండోసారి జోడీ కట్టనున్న బ్యూటీ

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌-ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ సిద్ధం కానున్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారనే విషయంలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఎంతోమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా, నెటిజన్ల ఊహాగానాలకు తెరదించుతూ చిత్రబృందం శనివారం ఉదయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ ఈ సినిమాలో చెర్రీ సరసన ఆడిపాడనున్నారని తెలియజేసింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లోకి కియారాకు స్వాగతం చెబుతూ ఓ ఫొటోని షేర్‌ చేసింది.

‘వినయ విధేయ రామా’ అనంతరం చరణ్‌-కియారా కాంబినేషన్‌లో రానున్న రెండో చిత్రమిది. రామ్‌చరణ్‌ 15వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2024లో విడుదల చేయవచ్చని టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఆ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తైన వెంటనే ఆయన.. శంకర్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించే అవకాశాలున్నట్లు సమాచారం.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని