Ramcharan 15: ఆర్‌సీ 15 షురూ.. క్లాప్‌ కొట్టిన చిరంజీవి.. - telugu news rc 15 shoot starts
close
Updated : 08/09/2021 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ramcharan 15: ఆర్‌సీ 15 షురూ.. క్లాప్‌ కొట్టిన చిరంజీవి..

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ కొత్త సినిమా పట్టాలెక్కింది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు పలువురు స్టార్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్‌ స్టార్‌హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఈ వేడుకలో పాల్గొని టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ముహూర్తపు షాట్‌లో భాగంగా చిరంజీవి తన తనయుడు రామ్‌చరణ్‌పై క్లాప్‌ కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. చరణ్‌ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చరణ్‌కు జోడీగా కియారా సందడి చేయనున్నారు. అంజలి, జయం రవి, శ్రీకాంత్‌, సునీల్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని