Tollywood: సాయికుమార్‌ ఇంట చిరు సందడి - telugu news sai kumar birthday celebrations
close
Published : 26/07/2021 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: సాయికుమార్‌ ఇంట చిరు సందడి

హైదరాబాద్‌: నటుడు, డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ఇంట జరిగిన వేడుకలో అగ్ర కథానాయకుడు చిరంజీవి సందడి చేశారు. సాయికుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. సాయికుమార్‌ 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కుటుంబసభ్యుల సమక్షంలో తన భార్య సురేఖతో ఆయన షష్ఠిపూర్తి వేడుకలు జరుపుకొన్నారు. ఎంతో ఘనంగా సాగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా చిరు, వెంకటేశ్‌, రాజశేఖర్‌-జీవిత వంటి టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. సాయికుమార్‌ దంపతులకు అభినందనలు తెలిపారు. అనంతరం సాయి ఫ్యామిలీతో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు సాయి ప్రస్తుతం వెండితెర, బుల్లితెర వేదికలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. రానున్న ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి సాయికుమార్‌ పోటీలోకి దిగుతున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని