Cinema News: రోజంతా తనతోనే గడపాలని కండిషన్ పెట్టాడు: నటి    - telugu news sneha jain shocking comments on south director
close
Published : 02/10/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: రోజంతా తనతోనే గడపాలని కండిషన్ పెట్టాడు: నటి  

సౌత్‌ దర్శకుడిపై ముంబయి తార షాకింగ్‌ కామెంట్స్‌

ముంబయి‌: దక్షిణాదికి చెందని ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ముంబయి నటి స్నేహా జైన్‌ ఆరోపించారు. ప్రస్తుతం ‘సాత్ నిభానా సాథియా-2’ ధారావాహికలో నటిస్తున్న ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్స్‌ విషయాలు బయటపెట్టారు. కెరీర్‌ ఆరంభంలో తాను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నానని అన్నారు. దక్షిణాదికి చెందిన ఓ దర్శకుడు తనతో ఫోన్‌లో చాలా అసభ్యంగా మాట్లాడాడని.. రోల్‌ కావాలంటే అన్నింటికీ ఒప్పుకోవాలన్నాడని ఆమె తెలిపారు.

‘నేను పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో దక్షిణాదికి చెందిన ఓ దర్శకుడి నుంచి నాకు ఒక ఆఫర్‌ వచ్చింది. కాలేజ్‌ స్టూడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమాలో నాకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పాడు. అందులో మూడు జోడీలుంటాయని.. అందరివీ ప్రాధాన్యం ఉన్న పాత్రలేనని ఆయన అన్నాడు. దాంతో నా వివరాలు, ఫొటోలను ఆయనకు పంపించాను. ఆ తర్వాత రోజు ఆయన నాకు ఫోన్‌ చేసి హైదరాబాద్‌కు రమ్మని చెప్పారు. అంతేకాకుండా, పారితోషికంలో సగం సినిమాకి ముందు ఇచ్చేస్తామని.. మిగతాది  సగం షూట్‌ అయ్యాక ఇస్తామని అన్నాడు. దానికి నేను, అంగీకరించాను. అదే సమయంలో, ఒకరోజంతా తనతోనే గడపాలని.. దేనికైనా ఓకే చెప్పాలన్నాడు. ఆ మాటకు నేను షాక్‌ అయ్యాను. నేను అలాంటివి చేయనని చెప్పేశాను. అయితే వారం రోజుల తర్వాత కూడా ఆయన నాకు ఫోన్‌ చేసి.. ‘ఇలాంటి సర్వసాధారణం. నీకు ఇంకా ఆఫర్‌ ఉంది. నువ్వు ఓకే అను చాలు’ అన్నాడు. ఆ మాటకు గట్టిగా అరిచి ఫోన్‌ పెట్టేశాను’ అని స్నేహా వివరించారు.  


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని