Sneha Ullal: మెడలో మంగళసూత్రం.. జూనియర్‌ ఐష్‌ ఫొటోలు వైరల్‌ - telugu news snehaullal photos goes viral in internet
close
Published : 16/10/2021 08:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sneha Ullal: మెడలో మంగళసూత్రం.. జూనియర్‌ ఐష్‌ ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: నీలి రంగు కళ్లు.. ఆకట్టుకునే అందంతో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ను తలపిస్తూ జూనియర్‌ ఐష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి స్నేహా ఉల్లాల్‌. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న స్నేహా ఇన్‌స్టా వేదికగా తరచూ నెటిజన్లకు చేరువగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఉదయం ఆమె కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఆ ఫొటోల్లో ఆమె మెడలో మంగళసూత్రం.. నుదిటిన సింధూరంతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. దీంతో ఆ ఫొటోలు కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాటిన చూసిన నెటిజన్లు ‘మేడమ్‌ మీకు పెళ్లి ఎప్పుడు అయ్యింది?’ అంటూ కామెంట్లు పెట్టారు. తాజాగా సదరు కామెంట్లకు ఆమె స్పందించారు. యాడ్‌ షూట్‌ కోసమే మెడలో మంగళసూత్రం ధరించానని.. తనకు ఇంకా పెళ్లి కాలేదని.. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని స్నేహా క్లారిటీ ఇచ్చారు.

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘లక్కీ’తో స్నేహాఉల్లాల్‌ కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో దక్షిణాదిలో లక్‌ని పరీక్షించుకోవడానికి ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించడంతో స్నేహాకు ఇక్కడ అవకాశాలు వరుస కట్టాయి. ‘నేను మీకు తెలుసా’, ‘కరెంట్‌’, ‘వరుడు’, ‘సింహా’.. ఇలా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. 2014లో వచ్చిన ‘అంతా నీ ఇష్టం’ తర్వాత తెలుగు తెరకు దూరంగా ఉన్నారు. గతేడాది ‘ఎక్స్‌పైరీ డేట్‌’ అనే వెబ్‌సిరీస్‌తో ఆమె స్క్రీన్‌పై మెరిశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని