RamCharan: అప్పాతో ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను - telugu news unforgettable moments in life says ram chran
close
Updated : 22/08/2021 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RamCharan: అప్పాతో ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను

తండ్రీకొడుకుల ఆప్యాయతకు నిదర్శనమిది..!

హైదరాబాద్‌: తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవికి రామ్‌చరణ్‌ స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘ఆచార్య’ షూట్‌లో భాగంగా తన తండ్రితో గడిపిన ప్రతి క్షణాన్నీ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ‘ఆచార్య’ షూట్‌కు సంబంధించిన ఓ చిన్న గ్లిమ్స్‌ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. ‘నేను అప్పా అని ప్రేమగా పిలిచే మా ఆచార్యతో గడిపిన ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెర్రీ పేర్కొన్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు ‘ఆచార్య’గా ఫుల్‌ పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ సిద్ధగా కీలకపాత్ర పోషించారు. చిరుకి జోడీగా కాజల్‌, చెర్రీకి జోడీగా పూజాహెగ్డే మెప్పించనున్నారు. సోనూసూద్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు చిరు 66వ పుట్టినరోజుని పురస్కరించుకుని చరణ్‌తోపాటు దర్శకుడు కొరటాల శివ, బాబీ, మెహర్‌ రమేశ్‌, రవితేజ, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

‘మా మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనతో సినిమా చేయడం నిజంగా నా అదృష్టం. ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. నా జీవితంలో ఉన్న మధుర జ్ఞాపకాల్లో ఇది కూడా ఒకటి. మా మెగాస్టార్‌ ఇంకా ఎన్నో సంవత్సరాలు అలరించాలని.. ఎంతో నేర్పాలని ఆశిస్తున్నాను’ -కొరటాల శివ

‘చిరంజీవి అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ - శ్రీకాంత్‌

‘రాజులకే రాజు మా రారాజు మెగాస్టార్‌ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. మాలాంటి ఎంతోమంది యువతరం నటీనటులకు మీరే నిజమైన స్ఫూర్తి. మీ తదుపరి చిత్రాల కోసం ఎదురుచూస్తున్నాను’ - శ్రీవిష్ణు

‘నా దేవుడు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ లెగసీ భవిష్యత్తు తరాలకూ స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నాను. యువ నటీనటులతోపాటు పరిశ్రమలోకి అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరికీ మీరు అందించే ప్రోత్సాహం మరువలేనిది. మీరు ఎప్పటికీ మా గుండెల్లో ‘చిరంజీవే’’ - సంపత్‌నంది

‘మోస్ట్‌ సెలబ్రేటెడ్‌ నేమ్‌ ఇన్‌ తెలుగు సినిమా పద్మభూషణ్‌ మెగాస్టార్‌ డాక్టర్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ - రానా

‘భారతీయ సినిమాకి లెజెండ్‌గా చెప్పుకొనే మన మెగాస్టార్‌ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు’ - నాగశౌర్య

‘కింగ్‌ ఆఫ్‌ హార్ట్స్‌.. ఆల్‌ రౌండర్‌ ఆఫ్‌ ఆర్ట్స్.. ఎన్నో తరాలకు ఆయనే స్ఫూర్తి. మన మెగాస్టార్‌ చిరంజీవికి బర్త్‌డే విషెస్‌’ - బాబీ










Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని