Ramarao On Duty: ఎనిమిదేళ్ల తర్వాత ‘స్వయంవరం’ హీరో రీఎంట్రీ - telugu news venu comback to movies
close
Published : 29/07/2021 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ramarao On Duty: ఎనిమిదేళ్ల తర్వాత ‘స్వయంవరం’ హీరో రీఎంట్రీ

హైదరాబాద్‌: రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నారు. కాగా, వాస్తవిక ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అలనాటి నటుడు వేణు భాగమైనట్లు చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సుమారు ఎనిమిదేళ్ల తర్వాత వేణు ఈ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వడంతో సినీ ప్రియులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక.

‘స్వయంవరం’ చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న నటుడు వేణు. కెరీర్‌ ఆరంభంలో ‘చిరునవ్వుతో’, ‘చెప్పవే చిరుగాలి’, ‘కళ్యాణ రాముడు’, ‘పెళ్లాం ఊరెళ్తే’, ‘ఖుషిఖుషిగా’ వంటి ప్రేమ, కుటుంబకథా చిత్రాల్లో నటించిన మెప్పించిన వేణు.. ఒకానొక సమయంలో వరుస పరాజయాలు అందుకున్నారు. దాంతో, ఆయన 2013లో విడుదలైన ‘రామాచారి ఈడో పెద్ద గూఢచారి’ తర్వాత పరిశ్రమకు దూరంగా ఉన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని