సమంత ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వచ్చేది అప్పుడే! - the family man 2 to stream in june
close
Published : 17/05/2021 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వచ్చేది అప్పుడే!

ఇంటర్నెట్‌ డెస్క్: మనోజ్‌బాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమైన హిందీ వెబ్‌ సీరీస్‌ చిత్రం ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’. ఈ సినిమాకి సీరీస్‌కు కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ మ్యాన్‌- 2’ తెరకెక్కింది. ఇందులో ప్రముఖ నటి సమంత నటిస్తోంది. ఆమె వెబ్‌సీరీస్‌లో నటించడం ఇదే మొదటిసారి. తొలుత సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 12న విడుదల కానుందని ప్రకటించారు. అయితే అనుకోని కారణాల వల్ల సినిమా మరికొంత ఆలస్యమైంది. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని మే 19న  విడుదల చేయనున్నారు. ప్రొమోలో సమంతకు సంబంధించిన పాత్ర పరిచయం కానుంది. సినిమాని జూన్ మొదటి లేదా రెండో వారంలో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారని సమాచారం. సమంత  ఇందులో ఉగ్రవాది పాత్రలో కనిపించనుంది. రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సమంత ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’లో  ప్రధాన పాత్రలో నటిస్తుంది. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న కాథువాకుల రెండు కాదల్‌’చిత్రంలో విజయ్‌సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తోంది. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని