ఫస్ట్‌ సిరీస్‌.. లాస్ట్‌ సీన్‌లో సామ్‌..! - the family man2 teaser out now
close
Published : 13/01/2021 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫస్ట్‌ సిరీస్‌.. లాస్ట్‌ సీన్‌లో సామ్‌..!

ఆకట్టుకునేలా టీజర్‌

హైదరాబాద్‌: ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత అక్కినేని ఇటీవల కాలంలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ సెలబ్రిటీ చాట్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్‌ త్వరలోనే వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకోనున్నారు. బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ వాజ్‌పేయీ, నటి ప్రియమణి జంటగా నటిస్తున్న యాక్షన్‌, స్పై థ్రిల్లర్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’లో సమంత కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తాజాగా ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’ టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘శ్రీ ఎక్కడ ఉన్నావ్‌? నా ఫోన్‌ ఎందుకు లిఫ్ట్‌ చేయడం లేదు’ అంటూ ప్రియమణి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఆరంభం నుంచి మనోజ్‌ కుటుంబాన్ని, ఆయన వృత్తిని ప్రేక్షకులకు పరిచయం చేసేలా చూపించిన చిత్రబృందం టీజర్‌ చివర్లో సమంతను అలా ఒక్కసారి చూపించింది. సామ్‌ గెటప్‌ చాలా విభిన్నంగా ఉండడంతో ఈ సిరీస్‌లో ఆమె ఉగ్రవాదిలా కనిపించనున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’ సిరీస్‌ టీజర్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా త్వరలో విడుదల కానున్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ను ఈనెల 19న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇదీ చదవండి

అమ్మ నాకు నేర్పింది అదేAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని