RRR: ఆడియన్స్‌ కన్నీళ్లు పెట్టుకుంటారు - writer vijayendra prasad about tarak and rrr movie
close
Updated : 26/05/2021 12:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: ఆడియన్స్‌ కన్నీళ్లు పెట్టుకుంటారు

రచయిత విజయేంద్ర ప్రసాద్‌

హైదరాబాద్‌: భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ఫైట్‌ సీక్వెన్స్‌కి సైతం ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారని చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్‌ఆర్‌’, తారక్‌ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ స్థాయిని తారక్‌ సొంతం చేసుకుంటాడని ‘స్టూడెంట్ నెం.1’ సమయంలోనే తనకు అనిపించిందని తెలిపారు. అంతేకాకుండా ‘భజరంగీ భాయీజాన్’ లాంటి ఎమోషనల్‌, సెంటిమెంటల్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ నటిస్తే చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.

‘‘మన సినిమా గురించి మనం గొప్పగా చెప్పుకోవడం సభ్యత కాదు. కానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. మామూలుగా ఏదైనా సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ వస్తే.. ఈలలు వేయడం మనం చేస్తుంటాం. కానీ మొదటసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. ఎంతో బాధగా అనిపించింది. ప్రేక్షకులు కూడా తప్పకుండా అదే అనుభావాన్ని పొందుతారని పక్కాగా చెప్పగలను. ఫైట్‌ సీక్వెన్స్‌కి కూడా ప్రేక్షకులు భావోద్వేగాన్ని ఫీల్‌ అవుతారు’’ అని విజయేంద్రప్రసాద్‌ వివరించారు.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. యాక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో తారక్‌ కొమురంభీమ్‌గా, చెర్రీ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. డీవీవీ దానయ్య సుమారు రూ.450 కోట్లతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని