నాలో మరో కొత్త నరేష్‌ని చూస్తారు! - you will see another new naresh in me
close
Updated : 16/02/2021 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలో మరో కొత్త నరేష్‌ని చూస్తారు!

హైదరాబాద్‌: అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సతీష్‌ వేగేశ్న నిర్మాత. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.  తాజాగా ఈ సినిమా ముందుస్తు విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.  

ఈ సందర్భంగా నరేష్‌ మాట్లాడుతూ..  ‘‘ఈ చిత్రంతో నాలో ఓ కొత్త నరేష్‌ని చూస్తారు. ‘గమ్యం’ తరువాత ఇందులోని ‘కంటినీరు మంటలాగా మారడానికి’ అనే పాట నాకు ఎంతో నచ్చింది. ఇప్పటివరకు నా హైట్‌కు సరిపోయే కథానాయిక దొరకలేదు.  ఇప్పుడు నవమి దొరికింది. ఇక వరలక్ష్మి సెట్లోకి వచ్చిందంటే మాకు టెర్రరే. ఆమె ఆన్‌స్ర్కీన్‌లో ఎంత బాగుంటుందో ఆఫ్‌ స్క్రీన్‌‌లో చాలా సరదాగా ఉంటుంది. సినిమాలో ఎమోషన్‌తో పాటు మిమ్మల్ని నవ్విస్తాం. ఎన్ని కొత్త ప్రయోగాలు చేసినా హాస్య చిత్రాలను మాత్రం వదులుకోను. సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ చిత్ర విజయోత్సవంలో కలుసుకుందాం. అప్పుడు కచ్చితంగా ఇంకా ఎక్కువ మాట్లాడతా’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.  ‘చేయని నేరానికి శిక్షను ఎదుర్కొన్న నిరపరాధి అయిన యువకుడి కథ ఇది. జైలు నేపథ్యంలో ఉంటుంది. ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై  రూపొందిన చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, నవమి, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి, దేవీప్రసాద్‌, వినయ్‌వర్మ తదితరులు నటిస్తున్నన్నారు. చిత్రానికి కెమెరా: సిధ్‌, సంగీతం: శ్రీచరణ్‌  పాకాల, కథ: తూమ్‌ వెంకట్‌, సంభాషణలు: అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌ కనకమేడల.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని