close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డిసెంబరు 4నుంచి ఏఎంబీ సినిమాస్‌

హైదరాబాద్‌: కరోనాతో కళ తప్పిన వెండితెర.. మళ్లీ కొత్త వెలుగులు సంతరించుకోనుంది.  ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి థియేటర్లు తెరవడానికి అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెండితెర వినోదాలను పునఃప్రారంభించేందుకు థియేటర్, మల్టీప్లెక్స్‌ యజమానులు సిద్ధమవుతున్నాయి. డిసెంబరు 4నుంచి ఏఎంబీ సినిమాస్‌ను తిరిగి తెరవనున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. కథా    నాయకుడు మహేష్‌బాబు భాగస్వామిగా వ్యవహరిస్తున్న మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌ సంస్థ ఇది. మంగళవారం నుంచే బుకింగ్స్‌ ప్రారంభిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ‘టెనెన్ట్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ తదితర చిత్రాలు ప్రదర్శించబోతున్నట్లు తెలియజేశారు.

ఏఎంబీ మల్టీప్లెక్స్‌ ప్రకటనపై రానా, విష్వక్‌ సేన్‌ సహా పలువురు స్టార్లు హర్షం వ్యక్తం చేశారు. ‘‘టెనెన్ట్‌’ను థియేటర్లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అంటూ రానా ట్వీట్‌ ద్వారా తన ఆనందాన్ని    పంచుకోగా.. ‘‘మనం మళ్లీ వస్తున్నాం’’ అని విష్వక్‌ తన సంతోషాన్ని తెలిపారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు