
హైదరాబాద్: పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్, హీరోయిజంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తెరకెక్కిస్తుంటారు దర్శకుడు పూరీ జగన్నాథ్. కథకు తగ్గట్టుగా ఆయన పెట్టే టైటిల్స్‌కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే పూరీ.. తాను దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు మొదట ఒక టైటిల్ అనుకుని తర్వాత పలు కారణాలు వల్ల వాటిని మార్చారు. పూరీ పుట్టినరోజు సందర్భంగా వాటికి సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం..
రామ్‌చరణ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘చిరుత’. అయితే ఈ సినిమాకి మొదట ‘కుర్రాడు’ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. ‘లో క్లాస్ ఏరియా’ ఉపశీర్షిక. అయితే చిరు తనయుడు అనే అర్థం వచ్చేట్ట్టుగా ‘చిరుత’ అనే పేరును ఫైనల్ చేశారు.
పవన్‌కల్యాణ్ కెరీర్లో ఓ హిట్ చిత్రం ‘బద్రి’. రేణూ దేశాయ్, అమీషా పటేల్ కథానాయికలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదట ‘చెలి’ అనే పేరు పెట్టాలనుకున్నారు. కానీ ఆ పేరు మరీ క్లాస్‌గా ఉందని స్నేహితులు చెప్పడంతో టైటిల్ మార్చి ‘బద్రి’ అని పెట్టారు.
రవితేజ - పూరీజగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’. ఈ చిత్రానికి మొదట ‘జీవితం’ అనే పేరు పెట్టాలనుకున్నారు.
తారక్-పూరీ కాంబినేషన్లో విడుదలైన చిత్రం ‘ఆంధ్రావాలా’. మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన ఈ సినిమాకి మొదట ‘కబ్జా’ అని టైటిల్ అనుకున్నారు.
మహేశ్‌బాబు కథానాయకుడిగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘పోకిరి’ అయితే ఈ చిత్రానికి మొదట ‘ఉత్తమ్ సింగ్’ అనే టైటిల్ అనుకున్నారు.
పూరీ నో చెప్పడంతో అజయ్ హీరో
నటుడు అజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సారాయి వీర్రాజు’. నర్సీపట్నం నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే పూరీ జగన్నాథ్ సొంత ఊరు నర్సీపట్నం సమీపంలోనే కావడంతో.. సదరు చిత్రంలో ఆయన్ని హీరోగా నటించమని దర్శకుడు డి.ఎస్.కణ్ణన్ అడిగారు. కణ్ణన్ ఇచ్చిన అవకాశాన్ని పూరీ సున్నితంగా తిరస్కరించారు. అలా చివరికి అజయ్‌ని హీరోగా తీసుకున్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- రూ.50 అప్పు... ప్రాణం తీసింది
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!