
ఆమె తప్పులేకపోయినా..: సునీల్ శెట్టి
ముంబయి: ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కుమార్తెగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి అతియా శెట్టి. ‘హీరో’తో అరంగేట్రం చేసిన ఆమె 2017లో ‘ముబారకన్’, 2019లో ‘మోటిచూర్ చక్నాచూర్’ సినిమాల్లో కనిపించారు. అతియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ జంటగా నటించిన ‘మోతిచూర్ చక్నాచూర్’కు దేబామిత్రా బిశ్వాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లోకి రావడానికి ముందు వివాదంలో చిక్కుకుంది. దర్శకురాలికి, నిర్మాతలకు మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. అది కాస్త వివాదానికి దారి తీసింది. అంతేకాదు సునీల్, అతియాను కూడా ఇందులోకి లాగారు.
అప్పట్లో జరిగిన ఈ సంఘటనతో తన కుమార్తె అతియా శెట్టి బెదిరిపోయిందని సునీల్ శెట్టి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అతియాకు అన్నీ నేనే. నాతో స్నేహంగా ఉంటుంది.. కొడుతుంటుంది కూడా (సరదాగా). జీవితంలో ఏది ముఖ్యమనేదానిపై అతియాకు ఎంతో స్పష్టత ఉంది. ‘మోతిచూర్ చక్నాచూర్’ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ అదే చిత్రం ఆమెను భయబ్రాంతులకు గురి చేసింది. నా కుమార్తె తప్పు లేకపోయినా.. అనవసరంగా ఆమె పేరును వివాదంలోకి లాగారు. ఇప్పుడు ఓ సినిమా తన దగ్గరికి వస్తే.. ఆందోళన చెందుతోంది. ఒకటికి 25 సార్లు ఆలోచించి, నిర్ణయం తీసుకుంటోంది’ అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- రూ.50 అప్పు... ప్రాణం తీసింది
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!