
తనపై వస్తున్న కామెంట్ల గురించి స్పందించిన నటి
ముంబయి: వరుణ్ ధావన్-సారా అలీఖాన్ జంటగా నటించిన చిత్రం ‘కూలీ నం.1’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సారా-వరుణ్‌ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే, 1995లో గోవిందా-కర్మిషాకపూర్ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘కూలీ నం.1’కి ఇది రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసి.. కర్మిషా కపూర్ స్థాయిలో సారా నటించలేదంటూ పలువురు మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా సారా నటనని కర్మిషాతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ కామెంట్లపై సారా తాజాగా స్పందించారు. ‘‘కూలీనం.1’కు రీమేక్‌గా మా సినిమా అనుకున్న సమయంలోనే ఇలాంటి కామెంట్లు వస్తాయని ఊహించాం. అయితే, ‘కూలీనం.1’ని రీమేక్ చేసినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని మా చిత్రాన్ని తెరకెక్కించాం.’
‘నా నటనను ఆనాటి కరిష్మాతో పోల్చడం సరికాదు. ఆమె అద్భుతమైన నటి. నటిగా ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె పోషించిన పాత్రలో నేను నటించాను తప్ప ఆమెలా నటించలేదు. కర్మిషాలా నటించడం అసాధ్యం కాబట్టి.. ఆమెని కాపీ కొట్టేబదులు ఆ పాత్రకు కొత్తదనం తీసుకురావాలనుకున్నాం. అందుకే నేను నాలా నటించాను. అలాగే, వరుణ్‌తో కలిసి స్ర్కీన్ పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని సారా అలీఖాన్ తెలిపారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- రూ.50 అప్పు... ప్రాణం తీసింది
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!