close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘జాన్వీకి నాకన్న మీరే గొప్ప తండ్రయ్యారు’

పంకజ్‌ను ప్రశంసించిన బోనీ కపూర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ వ్యక్తి అయినా తన కూతురికి తానే గొప్ప తండ్రిగా ఉండాలనుకుంటాడు.. కానీ జాన్వీకపూర్‌కు నిజ జీవితంలో తండ్రి బోనీ కపూర్‌ కంటే సినిమాలో ఆమెకు నాన్నలా నటించిన పంకజ్‌ త్రిపాఠినే గొప్ప తండ్రిగా నిలిచాడట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. జాన్వీ కపూర్‌ కన్నతండ్రి బోనీ కపూరే. 

శ్రీదేవి-బోనీ కపూర్‌ కుమార్తె జాన్వీ కపూర్‌ నటించిన ‘గుంజన్‌ సక్సేనా:ది కార్గిల్‌ గర్ల్‌’ చిత్రం బుధవారం నెట్‌ఫ్లెక్స్‌లో విడుదలైంది. యుద్ధ విమానాల తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ జీవితం ఆధారంగా తీసిన చిత్రమే అయినా ముఖ్యంగా చెప్పుకొవాల్సింది తండ్రి-కూతుళ్ల మధ్య అనుబంధం గురించి. గుంజన్‌ పాత్రలో జాన్వీ కపూర్‌ నటించగా.. కూతురు ఆశయాలకు అండగా నిలిచే తండ్రి పాత్రను పంకజ్‌ త్రిపాఠి పోషించారు. ఇందులో ఈ తండ్రి-కూతురు మధ్య సాగే సంభాషణలు, భావోద్వేగాలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. అందుకే ఈ చిత్రాన్ని చూసిన జాన్వీ తండ్రి బోనీ కపూర్‌.. వెంటనే పంకజ్‌ త్రిపాఠికి ఫోన్‌ చేసి ప్రశంసించారట. 

‘‘జాన్వీకి నాకన్న మీరే గొప్ప తండ్రిగా నిలిచారు. ఇలాంటి తండ్రి-కూతుళ్ల అనుబంధాన్ని నేను ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడలేదు. ఎంతో సహజంగా ఉంది’’అని బోనీ కపూర్‌ తనతో ఫోన్‌లో చెప్పారని పంకజ్‌ త్రిపాఠి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ క్షణంలో ఆయన భావాలను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. బోనీ కపూరే కాదు.. తనకు తెలిసిన చాలా మంది తండ్రులు ఈ సినిమా చూసిన తర్వాత వారి కూతుళ్లను హత్తకున్నామని పంకజ్‌కి చెప్పారట.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.